Monday, September 24, 2012

చెంప చెళ్ళుమనిపించింది...!!!!

నా కలల ప్రపంచం లో మళ్ళీ ఒక చిలిపి కల...

ఈరోజు ఉదయం నేను నా కాలేజి బస్ లో ఉన్నప్పుడు నిద్రవచ్చేసింది...
అప్పుడు నాకు వచిన కల ఇది...
ఎప్పటి లాగే నేను కాలేజి కి వెళ్ళి  నా క్లాసురూం లో చదువుకుంటూ ఉన్నాను...గురువులు వారి పని వారు కానిస్తున్నారు...నాకు బాగా బోర్ కొట్టి నిద్రవస్తోంది...అప్పుడు చాలా ఫోర్స్ గా ఎవరో తలుపు కొట్టిన శబ్దం...అందరూ అటువైపు చూస్తున్నారు,లెక్చరర్ మెల్లగా వెళ్ళి తలుపు తీసింది.నేను మాత్రం నిద్రలో మునిగిపొయాను.సడనుగా జి.వి.ఆర్ అని ఎవరో గట్టిగా అరిచేసరికి మెలకువ వచింది...నిదానంగా లేచి కళ్ళు నిమురుకుంటూ తలుపుకేసి చూసాను...నేను ఇష్టపడే అమ్మాయి నా ఎదురుగా ఉంది.అప్పుడు నేను బిత్తరపోయి చూస్తుంటే, ముఖం  లో  బోలెడు  కోపాన్ని  కూడగట్టుకొని..,కళ్ళు చిన్నవి చేస్తూ వేగంగా నా దగ్గరకు వచ్చికుడి చేయి అమాంతం చాచి చెంప చెళ్ళుమనిపించింది...!!!!నా క్లాస్మేట్స్ జి.వి.ఆర్ ని ఒక అమ్మాయి కొట్టటం ఏంటి అని ఆశ్చర్యపోయి చూస్తనన్నారు...అప్పుడు నా ఎడమ చేయి చెంపపై వాలి ఎందుకు కొట్టిందా అని ఆలోచిస్తుంటే"ఏంటి నన్ను అవైడ్ చేస్తున్నావా ??? వారం రోజులుగా మెసేజ్ చెయట్లేదు..!!?నేను ఎంత భయపడ్డానో తెలుసా..? ఆటలుగా ఉందా ? ప్లీస్ ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు."అంటూ తలదించుకుని నన్ను అమాంతం వాటేసుకుని ఏడ్చింది...
ఇంకేముంది...నా క్లాస్మేట్స్ అందరూ అవాక్కయ్యి చూస్తుండిపోయారు...ఆ లెక్చరర్ " What is this GVR ? You both just get out of the class...అని మావైపు కోపంగా చూస్తూ కసురుకుంది...వెంటనే నేను ఆవిడకి సారీ చెప్పి, తనని తీస్కుని బయటకు వచ్చి" కొంచం  బిజీ  మూలంగా  కాంటాక్ట్  అవలేదురా...I'm so sorry, ఇంకెప్పుడూ  ఇలా  జరగదు."అని నచ్చజెప్పి తనని ఆటో ఎక్కించి " జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు."అంటుండగా బస్సు కాలేజి చేరిందని నా స్నేహితుడు నిద్రలేపాడు.
ఈ కల ఎంత బాగుందో...ఇది అసాధారణం అని తెలుసు...కాని చాలా నచ్చింది...

Monday, September 3, 2012

వారే మావారు అంటూ నన్ను పిలచి...


నా ఇంజనీరింగ్ అయిపోయిన ఒక నాలుగు సంవత్సరాల తర్వాత,
నా బంధువుల ఇంట్లో ఏదో ఒక వేడుక జరుగుతుంది...
దానికి పెదనాన్నలు, బాబాయిలు, పిన్నులు, పెద్దమ్మలు, అత్తలు అందర్నీ పిలుస్తారు...

నేను నార్మల్ గా ఆఫీసు నుండి ఇంటికి వస్తాను...
డోర్ తెరవగానే నా భార్య చక్కగా ముస్తాబై ఎదురుగా నించుని ఉంటుంది...
ఏమిటీ హడావిడి అని అడగగానే వేడుక విషయం చెప్పి,
సర్ది ఉంచిన సూట్కేస్ చూపిస్తూ, నెక్ష్ట్ ఫ్లైటు కు టికెట్టులు బుక్ చెసానంటూ,
ఫ్రిజ్ లోనుండి జూస్ తీసి చేతికిచ్చి, 
"త్వరగా రెడీ అవ్వండి ఇంకా గంట మాత్రమే ఉంది" అంటుంది...
త్వర త్వరగా సిద్ధమయ్యి ఎయిర్ పోర్ట్ కు వచ్చి , 
ఇండియా ఫ్లైటు ఎక్కి ఇండియా వస్తాము...
ఇక్కడకు రాగానే మమ్మల్ని రిసీవ్ చేస్కోవటానికి 
అమ్మ, నాన్న, అన్న, వదిన, ఇంకొంతమంది బంధువులు ఎదురుచూస్తుంటారు...
అక్కడ నుండి ఇంటికి వస్తాము...

ఇంటికి రాగానే అన్న పిల్లలు,
"బాబాయ్ మాకేం తెచావ్" అంటూ సూట్కేస్ వైపుగా వస్తారు...
అప్పుడు నా భార్య "ఆగండి నేను ఇస్తానుగా...!!!" అంటూ 
సూట్కేస్ తెరచి వారి ముందుంచుతుంది...
ఇంతలో నాన్న "ఏరా ఎలా సాగుతోంది లైఫ్" అంటూ 
వెనుకగా వచ్చి నా ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుంటారు...
నేను సమాధానం చెప్పబోయే లోపే 
వంట గదిలోంచి అమ్మ 
నాన్నకు అన్నకు టీ తీస్కు వస్తూ "వేళ పట్టున తింటున్నావా ?" అని అడిగి 
తన చిన్న కోడలి పైపు చూస్తూ "మావాడేమైనా ఇబ్బంది పెడుతున్నాడామ్మా.!!" అంటుంది...
అప్పుడు తను "అయ్యయ్యో అదేం లేదు అత్తయ్య గారూ" అని చెప్పి
"నన్ను పిలవాల్సింది, మీరొక్కరే కష్టపడ్డారు" అంటుంది...

ఇంతలో వదిన పైకి రా ఆల్బంస్ చూపిస్తానంటూ
తనని మేడపైకి తీస్కువెళ్తుంది...
ఇలా ఆరోజు గడిచిపోతుంది...

మరుసటి రోజు బంధువుల ఇంటికి వెళ్తాము...
నేను సూట్ లో, నా భార్య బ్లూ శారీ విత్ గోల్డెను చంకీస్ లో వెళ్తాము...
బంధువులంతా "హేయ్ యు.ఎస్.ఎ నుండి ఎప్పుడొచారు ?" అని అడుగుతారు...
ఇంతలో నా భార్య పాత స్నేహితులు అక్కడకు వస్తారు...
తను వారితో ముచ్చటలాడుతూ, 
నవ్వుతూ తన కుడి చేతి మధ్య వేలును తన మేడపై ఉన్న హారం పై వేస్తుంది...
అప్పుడు తన స్నేహితురాళ్ళు "నెక్లెస్ చాలా చాలా బాగుంది. 
ఎవరి సెలెక్షను ?" అని అడగగానే
"మావారిచ్చిన బర్త్ డే గి్ఫ్ట్" అని చెప్పి అటూ ఇటూ చూస్తూ నన్ను వెదికి 
కనపడగానే అదిగో వారే మావారు అంటూ నన్ను పిలచి
వారికి పరిచయం చేస్తూ నా చేతిని తన చేతితో సంకెల వేస్తూ
నా బుజం పై తల వాలుస్తుంది...

ఇదంతా నాకు ఇంజనీరింగ్ మొదటి వత్సరం లో వచ్చిన కల
ఇదే నా జీవితం లో వస్తే...!!!!?
ఇలాంటి ఆణిముత్యాల్లాంటి కలలు నిజ జీవితం లో జరిగినా జరగకపోయినా
ఒక మధుర గ్నాపకం గా మిగిలిపోతాయి...
నాకు మాత్రం దీనిని నిజం అవ్వాలనే కోరుకుంటున్నాను...

Wednesday, June 13, 2012

నన్ను ప్రేమించే అమ్మాయి

బంధువుల ఇంట్లో ఏదైనా విశేషం ఉంటే చాలు పది రోజుల ముందే అక్కడికి వెళ్ళటానికి సిద్ధమైపోతుంటాం. ఈ తరహా ఉత్సుకత కూడా కేవలం మనం స్టూడెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది...
అదే స్టూడెంట్ గా ఉండి ప్రేమలో ఉన్న వారికైతే..!!!! ఓఓఓ అసలు ఇంకా ఎక్కువ. ఇదే విషయంలో నాకొక తీరని కోరిక ఒకటి ఉంది., అదేంటంటే...


తెలిసిన వారింట్లోనో లేదా బంధువుల ఇంట్లోనో ఏదో ఒక విశేషం ఉండి
నేనూ నా ఫ్యామిలీ అక్కడికి వెళ్తే
తను కూడా అక్కడికి వచ్చి
నా కోసం అటూ ఇటూ వెతుకుతూ
బంధువులతో మాట్లాడుతున్న నన్ను చూసి
మనసు పులకించి వచ్చే ఆనందాన్ని లోలోపల ఆపేస్తూ
లేని రాని కోపాన్ని ముఖంపై చూపిస్తూ
నేను తనవైపు చూడగానే
"పక్కకు రా నీ సంగతి చెబుతా" అన్నట్లు ఓ సూదిలాంటి చూపు నాపై విసిరి
వస్తున్నానా లేదా అని చూసుకుంటూ మేడ పైకి వెళ్ళి
నేను తన దగ్గరకు రాగానే నా కాలరు పట్టుకుని గోడకు నెట్టి
"నెల రోజులుగా కాంటాక్ట్ లో లేవేంటి ? మాట్లాడటం మానేశావా ?
లేదా అసలు ప్రేమించటమే మానేశావా ? చెప్పు ఏం మాట్లాడవేం ?" అనగానే
నేనేదో చెబుదాం అనుకుంటుండగా
"నీ కాల్ కోసం ఎంత ఎదురుచూశానో తెలుసా ??? నాకు చాలా ఏడుపొచ్చింది.
నన్ను మర్చిపోయావ్ అనుకున్నా" అంటూ చిన్నగా నా కాలరు వదులుతూ
తల దించుకుని మెల్లగా కన్నీరు పెట్టుకుంటే...
నేను తన బుజంపై చేయి వేసి
"sorry రా..! కావాలని కాదు,
కొంచం బిజీగా ఉండటం మూలంగా కాల్ చేయలెకపోయాను...
ఇక నుంచి అలా జరగదు ఓకె నా???" అంటూ తన తల ఎత్తి
కన్నీళ్ళు తుడుస్తూ ఉండగా
తను నా చేతులని పట్టుకుని,
"I am sorry...బాధలో ఎదో తిట్టేశాను...బట్ ఇంకోసారి ఇలా చేయొద్దు please"
అంటూ నన్ను వాటేసుకోగానే
నేను "పద మనకోసం అందరూ చూస్తుంటారు. కిందకి వెళ్దాం" అని
తన చేయి పట్టుకుని కిందకు తీసుకుపోవాలి...


ఈ సంఘటన జరిగినప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కానీ
ఇలా జరగితే బాగుంటుందని మాత్రం నా టెంత్ క్లాసు నుంచీ ఉంది.
నన్ను ప్రేమించే అమ్మాయి ఎక్కడుందో ఎప్పుడు కలుస్తుందో
నా కల ఎప్పుడు తీరుతుందో..!!!!!!!!!

Monday, June 11, 2012

ఎదురుచూసే నయనం...

ప్రతి రోజూ సాయంత్రం ఇంటికి రాగానే బ్యాగ్ ఇంట్లో పడేసి మేడ మీదకు వెళ్తే చల్లటి గాలి అక్కడక్కడ కమ్ముకొన్న మేఘాలు కనుచూపుమేరలో కనుమరుగౌతూ ఉన్న సూర్యుడు...
ఈ క్లైమేటు లో నాకొచ్చే ఆలోచన ఎంటో తెలుసా..!!!!

ఓ విశాలమైన సముద్ర తీరం 

దానిని ఆనుకొని ఓ చిన్న అడవి...
ఆ లోపలి నుంచి వచ్చే చల్లటి గాలి

ఆ గాలికి ముఖం పైన పడుతున్న ముంగురులను సవరించుకుంటూ
మోము లో సన్నని చిరునవ్వును ఇముడ్చుతూ
నా రాక లేక కొంచం చిన్నబోయే మనసుతో

నా ప్రియురాలు నాకోసం వేచిచూస్తుంటుంది...
నాకై ఎదురుచూసే నయనం నన్ను చూడగానే
ఎగిసే కెరటం లా ఉప్పొంగిపోతూ
నా దగ్గరకు వచ్చి అమాంతం కౌగిలించుకుని 

" ఎందుకింత ఆలస్యమైంది ? " అని
పక్కన కూర్చొబెట్టుకోని నా చేతిలో చెయ్యేసి

నా బాధలని పంచుకుంటూ తన బాధలని దాచుకుంటూ
నా మాటలని తన మాటలతో అడ్డుకుంటూ
" నేనున్నది నీకోసం, నీ సంతోషమే నా సర్వం " అని చెప్పి

నా బుజాలపై తల వాల్చి, చిన్ని చిన్ని ముచ్చట్లు చెప్తూ
నీతో ఇలా నిత్యం ఉండిపోతానంటూ మాట ఇస్తూ
ఆ సాయంకాలాన్ని రాత్రి వరకు నిద్రబుచ్చాలి...

ఈ ఊహ నాకు చెప్పలే్నంత ఆనందాన్ని ఇస్తుంది...
ఆ సమయం ఎప్పుడొస్తుందా అనే కుతూహలాన్నీ ఇస్తుంది...
అలాంటి క్షణం కోసం నా నయనం ఎప్పటికీ ఎదురుచూస్తూ ఉంటుంది.

Sunday, June 10, 2012

నాకూ ఓ గర్ల్ ఫ్రెండ్...

సాధారణంగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే పర్సుకు చిల్లి పడుతుందని అందరూ అంటుంటారు. కానీ ఆ అనుభూతి చాలా రమణీయంగా ఉంటుంది. నాకెప్పుడూ అనిపిస్తూంటుంది నాకంటూ ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుందా అని.


నాకూ ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండి
ప్రతి రోజూ ఉదయాన్నే Good Morning అని మెసేజ్ చేసి
లేచావా, రెడీ అయ్యావా అంటూ నా సమయాన్ని కొంచం కొంచం తినేస్తూ
మొబైల్ లోనే నన్ను కాలేజ్ కి సాగనంపుతూ
లంచ్ టైం కాగానే తిన్నావా అని మెసేజ్ చేస్తే,
సార్లు చూడకుండా నేను ఆ మెసేజ్ ని చూసి,
సాయంకాలం ఇంటికి రాగానే బయటకి వెళ్దాం అని
త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి అమ్మా గుడికి వెళ్ళొస్తా అంటూ
బయటపడి తనతో బైక్ మీద అలా అలా తిరిగి,
ఓ మంచి ఎసి రెస్టారెంట్ లో కాండిల్ లైట్ డిన్నర్ చేస్తుండగా ఓ మెలోడియస్ మ్యూసిక్...
ఆ తర్వాత తనని వాళ్ళ ఇంటి పక్క సందులో దింపి
" మీ ఇంటి ముందు దింపే రోజు ఎప్పుడొస్తుందో " అని ఒక చిన్న మాట చెప్తే
తను వెంటనే " ఆ రోజు త్వరలోనే వస్తుందిలే " అని చెప్పి
ఇంటి వైపు నడుస్తూ "మళ్ళీ ఎప్పుడు" అంటే, "we'll plan soon" అని బై చెప్పి
ఇంటికి వచ్చాక మళ్ళీ మొబైల్ కి అతుక్కుపోతూ...
11.00-11.30 అవగానే "love u ra...gd n8" అని ఎండ్ చేస్తూ ఉంటే..!!!!!!




ఎంత బాగుంటుందో కదా...
ఈ కల ఎప్పుడు నిజమౌతుందో...
ఇలాంటి రోజు నా లైఫ్ లో ఎప్పుడొస్తుందో...!!?