Wednesday, June 13, 2012

నన్ను ప్రేమించే అమ్మాయి

బంధువుల ఇంట్లో ఏదైనా విశేషం ఉంటే చాలు పది రోజుల ముందే అక్కడికి వెళ్ళటానికి సిద్ధమైపోతుంటాం. ఈ తరహా ఉత్సుకత కూడా కేవలం మనం స్టూడెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది...
అదే స్టూడెంట్ గా ఉండి ప్రేమలో ఉన్న వారికైతే..!!!! ఓఓఓ అసలు ఇంకా ఎక్కువ. ఇదే విషయంలో నాకొక తీరని కోరిక ఒకటి ఉంది., అదేంటంటే...


తెలిసిన వారింట్లోనో లేదా బంధువుల ఇంట్లోనో ఏదో ఒక విశేషం ఉండి
నేనూ నా ఫ్యామిలీ అక్కడికి వెళ్తే
తను కూడా అక్కడికి వచ్చి
నా కోసం అటూ ఇటూ వెతుకుతూ
బంధువులతో మాట్లాడుతున్న నన్ను చూసి
మనసు పులకించి వచ్చే ఆనందాన్ని లోలోపల ఆపేస్తూ
లేని రాని కోపాన్ని ముఖంపై చూపిస్తూ
నేను తనవైపు చూడగానే
"పక్కకు రా నీ సంగతి చెబుతా" అన్నట్లు ఓ సూదిలాంటి చూపు నాపై విసిరి
వస్తున్నానా లేదా అని చూసుకుంటూ మేడ పైకి వెళ్ళి
నేను తన దగ్గరకు రాగానే నా కాలరు పట్టుకుని గోడకు నెట్టి
"నెల రోజులుగా కాంటాక్ట్ లో లేవేంటి ? మాట్లాడటం మానేశావా ?
లేదా అసలు ప్రేమించటమే మానేశావా ? చెప్పు ఏం మాట్లాడవేం ?" అనగానే
నేనేదో చెబుదాం అనుకుంటుండగా
"నీ కాల్ కోసం ఎంత ఎదురుచూశానో తెలుసా ??? నాకు చాలా ఏడుపొచ్చింది.
నన్ను మర్చిపోయావ్ అనుకున్నా" అంటూ చిన్నగా నా కాలరు వదులుతూ
తల దించుకుని మెల్లగా కన్నీరు పెట్టుకుంటే...
నేను తన బుజంపై చేయి వేసి
"sorry రా..! కావాలని కాదు,
కొంచం బిజీగా ఉండటం మూలంగా కాల్ చేయలెకపోయాను...
ఇక నుంచి అలా జరగదు ఓకె నా???" అంటూ తన తల ఎత్తి
కన్నీళ్ళు తుడుస్తూ ఉండగా
తను నా చేతులని పట్టుకుని,
"I am sorry...బాధలో ఎదో తిట్టేశాను...బట్ ఇంకోసారి ఇలా చేయొద్దు please"
అంటూ నన్ను వాటేసుకోగానే
నేను "పద మనకోసం అందరూ చూస్తుంటారు. కిందకి వెళ్దాం" అని
తన చేయి పట్టుకుని కిందకు తీసుకుపోవాలి...


ఈ సంఘటన జరిగినప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కానీ
ఇలా జరగితే బాగుంటుందని మాత్రం నా టెంత్ క్లాసు నుంచీ ఉంది.
నన్ను ప్రేమించే అమ్మాయి ఎక్కడుందో ఎప్పుడు కలుస్తుందో
నా కల ఎప్పుడు తీరుతుందో..!!!!!!!!!

1 comment:

  1. ha ha ha, bagundandi mee kala. tondalone mee kala nijam kavalani korukuntunanu.

    ReplyDelete