Sunday, June 10, 2012

నాకూ ఓ గర్ల్ ఫ్రెండ్...

సాధారణంగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే పర్సుకు చిల్లి పడుతుందని అందరూ అంటుంటారు. కానీ ఆ అనుభూతి చాలా రమణీయంగా ఉంటుంది. నాకెప్పుడూ అనిపిస్తూంటుంది నాకంటూ ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుందా అని.


నాకూ ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండి
ప్రతి రోజూ ఉదయాన్నే Good Morning అని మెసేజ్ చేసి
లేచావా, రెడీ అయ్యావా అంటూ నా సమయాన్ని కొంచం కొంచం తినేస్తూ
మొబైల్ లోనే నన్ను కాలేజ్ కి సాగనంపుతూ
లంచ్ టైం కాగానే తిన్నావా అని మెసేజ్ చేస్తే,
సార్లు చూడకుండా నేను ఆ మెసేజ్ ని చూసి,
సాయంకాలం ఇంటికి రాగానే బయటకి వెళ్దాం అని
త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి అమ్మా గుడికి వెళ్ళొస్తా అంటూ
బయటపడి తనతో బైక్ మీద అలా అలా తిరిగి,
ఓ మంచి ఎసి రెస్టారెంట్ లో కాండిల్ లైట్ డిన్నర్ చేస్తుండగా ఓ మెలోడియస్ మ్యూసిక్...
ఆ తర్వాత తనని వాళ్ళ ఇంటి పక్క సందులో దింపి
" మీ ఇంటి ముందు దింపే రోజు ఎప్పుడొస్తుందో " అని ఒక చిన్న మాట చెప్తే
తను వెంటనే " ఆ రోజు త్వరలోనే వస్తుందిలే " అని చెప్పి
ఇంటి వైపు నడుస్తూ "మళ్ళీ ఎప్పుడు" అంటే, "we'll plan soon" అని బై చెప్పి
ఇంటికి వచ్చాక మళ్ళీ మొబైల్ కి అతుక్కుపోతూ...
11.00-11.30 అవగానే "love u ra...gd n8" అని ఎండ్ చేస్తూ ఉంటే..!!!!!!




ఎంత బాగుంటుందో కదా...
ఈ కల ఎప్పుడు నిజమౌతుందో...
ఇలాంటి రోజు నా లైఫ్ లో ఎప్పుడొస్తుందో...!!?

8 comments:

  1. looks like you have big dreams..

    ReplyDelete
  2. అల్ ద బెస్ట్

    ReplyDelete
  3. remember APJ Abdul Kalam , tanu em cheppadu , kalalu kanandi vatini sakaram cheskondi , nv 1st part sucecesful ga chesinattunav

    ReplyDelete
    Replies
    1. second part ki ika chance ledulendi...
      b.Tech anthaa chaduvulathone aipoindi...
      inka girl friend ekkadidi...

      Delete
  4. baaga chepparandi .. ye tv show lo chusina cinema lo chusina ammayilanu maintain cheyyadam kashtam manalni thinestharu ani ededo matladuthuntaaru .. kaneesam meeraina daaniloni happyness gurinchi chepparu .. impressive

    ReplyDelete