ప్రతి రోజూ సాయంత్రం ఇంటికి రాగానే బ్యాగ్ ఇంట్లో పడేసి మేడ మీదకు వెళ్తే చల్లటి గాలి అక్కడక్కడ కమ్ముకొన్న మేఘాలు కనుచూపుమేరలో కనుమరుగౌతూ ఉన్న సూర్యుడు...
ఈ క్లైమేటు లో నాకొచ్చే ఆలోచన ఎంటో తెలుసా..!!!!
ఓ విశాలమైన సముద్ర తీరం
దానిని ఆనుకొని ఓ చిన్న అడవి...
ఆ లోపలి నుంచి వచ్చే చల్లటి గాలి
ఆ గాలికి ముఖం పైన పడుతున్న ముంగురులను సవరించుకుంటూ
మోము లో సన్నని చిరునవ్వును ఇముడ్చుతూ
నా రాక లేక కొంచం చిన్నబోయే మనసుతో
నా ప్రియురాలు నాకోసం వేచిచూస్తుంటుంది...
నాకై ఎదురుచూసే నయనం నన్ను చూడగానే
ఎగిసే కెరటం లా ఉప్పొంగిపోతూ
నా దగ్గరకు వచ్చి అమాంతం కౌగిలించుకుని
" ఎందుకింత ఆలస్యమైంది ? " అని
పక్కన కూర్చొబెట్టుకోని నా చేతిలో చెయ్యేసి
నా బాధలని పంచుకుంటూ తన బాధలని దాచుకుంటూ
నా మాటలని తన మాటలతో అడ్డుకుంటూ
" నేనున్నది నీకోసం, నీ సంతోషమే నా సర్వం " అని చెప్పి
నా బుజాలపై తల వాల్చి, చిన్ని చిన్ని ముచ్చట్లు చెప్తూ
నీతో ఇలా నిత్యం ఉండిపోతానంటూ మాట ఇస్తూ
ఆ సాయంకాలాన్ని రాత్రి వరకు నిద్రబుచ్చాలి...
ఈ ఊహ నాకు చెప్పలే్నంత ఆనందాన్ని ఇస్తుంది...
ఆ సమయం ఎప్పుడొస్తుందా అనే కుతూహలాన్నీ ఇస్తుంది...
అలాంటి క్షణం కోసం నా నయనం ఎప్పటికీ ఎదురుచూస్తూ ఉంటుంది.
nijam gane elanti situation chala bagunthundi.
ReplyDelete