నా కలల ప్రపంచం లో మళ్ళీ ఒక చిలిపి కల...
ఈరోజు ఉదయం నేను నా కాలేజి బస్ లో ఉన్నప్పుడు నిద్రవచ్చేసింది...
అప్పుడు నాకు వచిన కల ఇది...
ఎప్పటి లాగే నేను కాలేజి కి వెళ్ళి నా క్లాసురూం లో చదువుకుంటూ ఉన్నాను...గురువులు వారి పని వారు కానిస్తున్నారు...నాకు బాగా బోర్ కొట్టి నిద్రవస్తోంది...అప్పుడు చాలా ఫోర్స్ గా ఎవరో తలుపు కొట్టిన శబ్దం...అందరూ అటువైపు చూస్తున్నారు,లెక్చరర్ మెల్లగా వెళ్ళి తలుపు తీసింది.నేను మాత్రం నిద్రలో మునిగిపొయాను.సడనుగా జి.వి.ఆర్ అని ఎవరో గట్టిగా అరిచేసరికి మెలకువ వచింది...నిదానంగా లేచి కళ్ళు నిమురుకుంటూ తలుపుకేసి చూసాను...నేను ఇష్టపడే అమ్మాయి నా ఎదురుగా ఉంది.అప్పుడు నేను బిత్తరపోయి చూస్తుంటే, ముఖం లో బోలెడు కోపాన్ని కూడగట్టుకొని..,కళ్ళు చిన్నవి చేస్తూ వేగంగా నా దగ్గరకు వచ్చికుడి చేయి అమాంతం చాచి చెంప చెళ్ళుమనిపించింది...!!!!నా క్లాస్మేట్స్ జి.వి.ఆర్ ని ఒక అమ్మాయి కొట్టటం ఏంటి అని ఆశ్చర్యపోయి చూస్తనన్నారు...అప్పుడు నా ఎడమ చేయి చెంపపై వాలి ఎందుకు కొట్టిందా అని ఆలోచిస్తుంటే"ఏంటి నన్ను అవైడ్ చేస్తున్నావా ??? వారం రోజులుగా మెసేజ్ చెయట్లేదు..!!?నేను ఎంత భయపడ్డానో తెలుసా..? ఆటలుగా ఉందా ? ప్లీస్ ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు."అంటూ తలదించుకుని నన్ను అమాంతం వాటేసుకుని ఏడ్చింది...
ఇంకేముంది...నా క్లాస్మేట్స్ అందరూ అవాక్కయ్యి చూస్తుండిపోయారు...ఆ లెక్చరర్ " What is this GVR ? You both just get out of the class..." అని మావైపు కోపంగా చూస్తూ కసురుకుంది...వెంటనే నేను ఆవిడకి సారీ చెప్పి, తనని తీస్కుని బయటకు వచ్చి" కొంచం బిజీ మూలంగా కాంటాక్ట్ అవలేదురా...I'm so sorry, ఇంకెప్పుడూ ఇలా జరగదు."అని నచ్చజెప్పి తనని ఆటో ఎక్కించి " జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు."అంటుండగా బస్సు కాలేజి చేరిందని నా స్నేహితుడు నిద్రలేపాడు.
ఈ కల ఎంత బాగుందో...ఇది అసాధారణం అని తెలుసు...కాని చాలా నచ్చింది...
:P
ReplyDelete