Friday, April 26, 2013

తను నన్ను పట్టుకొని అమాంతం ముద్దు పెట్టేసింది.

హలో ఫ్రెండ్స్...

చాలా కాలం తరువాత మళ్ళీ ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది.
ఐతె మరి ఈసారి కూడా ఒక కలతో వచ్చాను.
కానీ ఇది చాలా చాలా చిన్ని చిలిపి కల.

నా మొబైల్ రింగ్ అవుతోంది.
నేను మాత్రం ఏదో తెలియను మైమరపులో ఉన్నాను.
అప్పుడు నేను నా స్నేహితుని ఇంట్లో ఉన్నాను.
వాడు రెండు సార్లు నన్ను పిలిచి
ఎదో ధ్యాసలో ఉన్నానని గ్రహించి నా మొబైల్ తీసి కాల్ లిఫ్ట్ చేసాడు.

ఎవరో అమ్మాయి...
చిన్నా ఉన్నాడా అని అడిగింది.
వాడు వెంటనే నా వీపు మీద చరిచి నా మైమరపుని వదలగొట్టాడు.
ఎవరో అమ్మాయి, నీతో మట్లాడాలంట అని
మొబైల్ నా చేతిలో పెట్టాడు.
నేను మాట్లాడగానే
అవతలి అమ్మాయి ఏడవటం మొదలు పెట్టింది.
ఎవరు మట్లాడేది ? ఎందుకు ఏడుస్తున్నారు ? అని అడిగాను...
ఏమి మాట్లాడలేదు.

నేను మొబైల్ డిస్ప్లే మీద నంబరు చూశాను...
తను నాకు ఫోను చేయటం ఏంటి అని ఆశ్చర్యం వేసింది.
మళ్ళీ నా చెవి దగ్గర పెట్టుకోని
ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ ? అని అడిగాను.
తన కన్నీరు ఇంకా ఆగడం లేదని నాకర్ధమైంది.
ఎక్కడున్నావ్ ఇప్పుడు ? అని గట్టిగా అడిగాను.
నీకు ఇష్టమైన ప్లేస్ లో నే ఉన్నాను అని చెప్పింది.

నేను ఫోను పెట్టేసి బయల్దేరాను.
నేను బైక్ మీద వెళ్తున్నా, నా మనసు మాత్రం తన దగ్గరే ఉంది.
అసలు తను ఎందుకు ఏడుస్తోంది అని పదే పదే అదే ప్రశ్న...

నాకిష్టమైన ప్లేస్ వైజాగ్ బీచ్...
తను అక్కడికి రావటం నాకు ఆశ్చర్యమేసింది.
నేను విజయవాడ నుండి బయల్దేరాను...
బైక్ మీద వైజాగ్ వెళ్తున్నా...
ఎలా అని కానీ, ఏమీ ఆలోచించలేదు.
తన కోసం బయల్దేరాను అంతే.
ఆ 4:30 గంటలు...నా బైక్ స్పీడ్ 100 లోనే ఉంది.

అక్కడికి రాగానే తను ఒక బెంచ్ పై కూర్చుని
నాకోసం ఎదురు చూస్తోంది.

బీచ్ అంతా నిర్మానుష్యం గా ఉంది.
నేను తన దగ్గరకి వెళ్ళి తన బుజంపై చేయి వేశాను.
తను ఉలిక్కిపడి లేచి అమాంతం నన్ను వాటేసుకుంది.
తన ఇంకా ఎడుస్తూనే ఉంది.

నేను తనని వెనక్కి అని, 
ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ ??
అని అడిగాను.


అప్పుడు తను చెప్పిన మాటలు
" ఐ లవ్ యూ రా...
సారీరా చిన్నా, ఇన్నాళ్ళూ నిన్ను దూరంగా ఉంచాను.

నన్ను క్షమిస్తావు కదూ..!!!
ప్లీస్ రా ఇంక లైఫ్ లో నేను నిన్ను దూరం చేస్కోవాలనుకొవటం లేదు.

నీ ప్రేమకి నేను లొంగిపోతున్నాను. "అని మళ్ళీ నన్ను వాటేసుకుంది...
నా నోట మాట లేదు.

నేను తనని హోల్డ్  చేయలెదు.

నేను బాగా కంఫూషనులో ఉంటే
తను నన్ను పట్టుకొని అమాంతం ముద్దు పెట్టేసింది.

వేంటనే నేను ఉలిక్కిపడి లేచాను.
టైం 5:30... ఇంకేముంది మళ్ళీ నిద్రపోయాను.
మళ్ళీ ఎప్పుడో 8:00 కి అమ్మ లేపింది.

ఈ కల ఎప్పటికీ కల గానే మిగిలిపోతుందేమో...
నేను మాత్రం ఎదురు చూస్తునే ఉంటాను.

6 comments:

  1. yellow color is glittering too much.. unable read this.. use light colors please...

    ReplyDelete
  2. Superb dream...:) kala nijam ayye neeku istam ayna ammai nijamgane ala cheppali ani korukuntunnanu..:)

    ReplyDelete