Wednesday, June 13, 2012

నన్ను ప్రేమించే అమ్మాయి

బంధువుల ఇంట్లో ఏదైనా విశేషం ఉంటే చాలు పది రోజుల ముందే అక్కడికి వెళ్ళటానికి సిద్ధమైపోతుంటాం. ఈ తరహా ఉత్సుకత కూడా కేవలం మనం స్టూడెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది...
అదే స్టూడెంట్ గా ఉండి ప్రేమలో ఉన్న వారికైతే..!!!! ఓఓఓ అసలు ఇంకా ఎక్కువ. ఇదే విషయంలో నాకొక తీరని కోరిక ఒకటి ఉంది., అదేంటంటే...


తెలిసిన వారింట్లోనో లేదా బంధువుల ఇంట్లోనో ఏదో ఒక విశేషం ఉండి
నేనూ నా ఫ్యామిలీ అక్కడికి వెళ్తే
తను కూడా అక్కడికి వచ్చి
నా కోసం అటూ ఇటూ వెతుకుతూ
బంధువులతో మాట్లాడుతున్న నన్ను చూసి
మనసు పులకించి వచ్చే ఆనందాన్ని లోలోపల ఆపేస్తూ
లేని రాని కోపాన్ని ముఖంపై చూపిస్తూ
నేను తనవైపు చూడగానే
"పక్కకు రా నీ సంగతి చెబుతా" అన్నట్లు ఓ సూదిలాంటి చూపు నాపై విసిరి
వస్తున్నానా లేదా అని చూసుకుంటూ మేడ పైకి వెళ్ళి
నేను తన దగ్గరకు రాగానే నా కాలరు పట్టుకుని గోడకు నెట్టి
"నెల రోజులుగా కాంటాక్ట్ లో లేవేంటి ? మాట్లాడటం మానేశావా ?
లేదా అసలు ప్రేమించటమే మానేశావా ? చెప్పు ఏం మాట్లాడవేం ?" అనగానే
నేనేదో చెబుదాం అనుకుంటుండగా
"నీ కాల్ కోసం ఎంత ఎదురుచూశానో తెలుసా ??? నాకు చాలా ఏడుపొచ్చింది.
నన్ను మర్చిపోయావ్ అనుకున్నా" అంటూ చిన్నగా నా కాలరు వదులుతూ
తల దించుకుని మెల్లగా కన్నీరు పెట్టుకుంటే...
నేను తన బుజంపై చేయి వేసి
"sorry రా..! కావాలని కాదు,
కొంచం బిజీగా ఉండటం మూలంగా కాల్ చేయలెకపోయాను...
ఇక నుంచి అలా జరగదు ఓకె నా???" అంటూ తన తల ఎత్తి
కన్నీళ్ళు తుడుస్తూ ఉండగా
తను నా చేతులని పట్టుకుని,
"I am sorry...బాధలో ఎదో తిట్టేశాను...బట్ ఇంకోసారి ఇలా చేయొద్దు please"
అంటూ నన్ను వాటేసుకోగానే
నేను "పద మనకోసం అందరూ చూస్తుంటారు. కిందకి వెళ్దాం" అని
తన చేయి పట్టుకుని కిందకు తీసుకుపోవాలి...


ఈ సంఘటన జరిగినప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కానీ
ఇలా జరగితే బాగుంటుందని మాత్రం నా టెంత్ క్లాసు నుంచీ ఉంది.
నన్ను ప్రేమించే అమ్మాయి ఎక్కడుందో ఎప్పుడు కలుస్తుందో
నా కల ఎప్పుడు తీరుతుందో..!!!!!!!!!

Monday, June 11, 2012

ఎదురుచూసే నయనం...

ప్రతి రోజూ సాయంత్రం ఇంటికి రాగానే బ్యాగ్ ఇంట్లో పడేసి మేడ మీదకు వెళ్తే చల్లటి గాలి అక్కడక్కడ కమ్ముకొన్న మేఘాలు కనుచూపుమేరలో కనుమరుగౌతూ ఉన్న సూర్యుడు...
ఈ క్లైమేటు లో నాకొచ్చే ఆలోచన ఎంటో తెలుసా..!!!!

ఓ విశాలమైన సముద్ర తీరం 

దానిని ఆనుకొని ఓ చిన్న అడవి...
ఆ లోపలి నుంచి వచ్చే చల్లటి గాలి

ఆ గాలికి ముఖం పైన పడుతున్న ముంగురులను సవరించుకుంటూ
మోము లో సన్నని చిరునవ్వును ఇముడ్చుతూ
నా రాక లేక కొంచం చిన్నబోయే మనసుతో

నా ప్రియురాలు నాకోసం వేచిచూస్తుంటుంది...
నాకై ఎదురుచూసే నయనం నన్ను చూడగానే
ఎగిసే కెరటం లా ఉప్పొంగిపోతూ
నా దగ్గరకు వచ్చి అమాంతం కౌగిలించుకుని 

" ఎందుకింత ఆలస్యమైంది ? " అని
పక్కన కూర్చొబెట్టుకోని నా చేతిలో చెయ్యేసి

నా బాధలని పంచుకుంటూ తన బాధలని దాచుకుంటూ
నా మాటలని తన మాటలతో అడ్డుకుంటూ
" నేనున్నది నీకోసం, నీ సంతోషమే నా సర్వం " అని చెప్పి

నా బుజాలపై తల వాల్చి, చిన్ని చిన్ని ముచ్చట్లు చెప్తూ
నీతో ఇలా నిత్యం ఉండిపోతానంటూ మాట ఇస్తూ
ఆ సాయంకాలాన్ని రాత్రి వరకు నిద్రబుచ్చాలి...

ఈ ఊహ నాకు చెప్పలే్నంత ఆనందాన్ని ఇస్తుంది...
ఆ సమయం ఎప్పుడొస్తుందా అనే కుతూహలాన్నీ ఇస్తుంది...
అలాంటి క్షణం కోసం నా నయనం ఎప్పటికీ ఎదురుచూస్తూ ఉంటుంది.

Sunday, June 10, 2012

నాకూ ఓ గర్ల్ ఫ్రెండ్...

సాధారణంగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే పర్సుకు చిల్లి పడుతుందని అందరూ అంటుంటారు. కానీ ఆ అనుభూతి చాలా రమణీయంగా ఉంటుంది. నాకెప్పుడూ అనిపిస్తూంటుంది నాకంటూ ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుందా అని.


నాకూ ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండి
ప్రతి రోజూ ఉదయాన్నే Good Morning అని మెసేజ్ చేసి
లేచావా, రెడీ అయ్యావా అంటూ నా సమయాన్ని కొంచం కొంచం తినేస్తూ
మొబైల్ లోనే నన్ను కాలేజ్ కి సాగనంపుతూ
లంచ్ టైం కాగానే తిన్నావా అని మెసేజ్ చేస్తే,
సార్లు చూడకుండా నేను ఆ మెసేజ్ ని చూసి,
సాయంకాలం ఇంటికి రాగానే బయటకి వెళ్దాం అని
త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి అమ్మా గుడికి వెళ్ళొస్తా అంటూ
బయటపడి తనతో బైక్ మీద అలా అలా తిరిగి,
ఓ మంచి ఎసి రెస్టారెంట్ లో కాండిల్ లైట్ డిన్నర్ చేస్తుండగా ఓ మెలోడియస్ మ్యూసిక్...
ఆ తర్వాత తనని వాళ్ళ ఇంటి పక్క సందులో దింపి
" మీ ఇంటి ముందు దింపే రోజు ఎప్పుడొస్తుందో " అని ఒక చిన్న మాట చెప్తే
తను వెంటనే " ఆ రోజు త్వరలోనే వస్తుందిలే " అని చెప్పి
ఇంటి వైపు నడుస్తూ "మళ్ళీ ఎప్పుడు" అంటే, "we'll plan soon" అని బై చెప్పి
ఇంటికి వచ్చాక మళ్ళీ మొబైల్ కి అతుక్కుపోతూ...
11.00-11.30 అవగానే "love u ra...gd n8" అని ఎండ్ చేస్తూ ఉంటే..!!!!!!




ఎంత బాగుంటుందో కదా...
ఈ కల ఎప్పుడు నిజమౌతుందో...
ఇలాంటి రోజు నా లైఫ్ లో ఎప్పుడొస్తుందో...!!?