Monday, November 9, 2015

నను ప్రేమించే అమ్మాయి, ఇంతలో భూకంపం..

హాయ్ ఫ్రెండ్స్...

చాలా రోజుల తరువాత నాకు మరొక చిలిపి కల వచ్చింది. చాలానే వచ్చాయి కాని ఇది చాలా డిఫరెంట్ గా ఉంది.

నేను మా తమ్ముడు మా బబాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాం.
అనయ్యా బయటకి వెళ్ళొద్దాం అన్నాడు వాడు. సరే అని బయటకి బయల్దేరాం. 
ఎటు వెల్దాం అని అడిగితే షిప్ లో అలా వెళ్ళొద్దాం ఎంత దూరం అయితే అంత దూరం అన్నాడు. నేను షాక్ తిన్నాను, నువు ఏం మాట్లాదుతున్నావ్ రా అని నేను అనగానే, బీచ్ లో నే గా ఉన్నాం అని పక్క్నే మోటార్ బోట్ చుపించాడు. 

హుం... సరే పద అని బోట్ ఎక్కి అలా వెళ్తున్నాం. కొంచం దూరం వెల్లాక వెనకాల పోలీసులు వస్తున్నారు, బాబోయ్ ఇదేంతి అని బోట్ అంతా చుసాం, ఆ బోట్ నిండా బాంబ్ మెటిరియల్స్ ఉన్నాయ్. చచ్చాం రా బాబోయ్ అనుకుని స్పీడ్ గా వెల్తున్నాం. అసలు ట్విస్ట్ ఇప్పుడు వచింది.

సైడ్ నుంచి నేను ఇష్టపడే అమ్మాయి ఇంకో బోట్ వేస్కోని వచింది. చేతిలో గన్ ఉంది, లేడీ డాన్ లా ఉంది. ఫట్ ఫట్ ఫట్ అని పోలిసులని కాల్చేసింది.
నేను షాక్ లో నె ఉన్నా, బుత్ పోలిసులు చచ్చినందుకు ఒక పక్కన హాపీ గా నె ఉంది. నువ్వేంటి ఇక్కడునావ్ ? చేతిలో ఆ గన్ ఏంటి ? వాళ్ళని అలా చంపేశావ్ ఏంటి ? ఇలా ప్రశ్నలు వస్తునే ఉన్నాయ్...

షట్ అప్ అని గట్టిగా అరిచి, ఆ గన్ నా వైపు తిప్పింది. అనవసరమైన ప్రశ్నలు వేస్తే లేపి పడేస్తా, మా మెటిరియల్ ఎందుకు ఎతుకెల్తున్నావ్ ? ఎవరు పంపారు నిన్ను అని అడిగింది...
కాని మనకి అంత టైం లేదు, తను గన్ పెట్టగానె నా మతి పోయింది. కళ్ళు తిరిగి పడిపొఆను.
ఏం జరిగిందో నాకు తెలీదు. కొద్దిసేపటికి లేచాను. పక్కనె తను కూర్చుని ఉంది, మా తమ్ముడు ఏడి అని అడిగాను. నాకేం తెలుసు అని సమాధానం ఇచ్చింది.
నువ్వేంటి గన్ పటుకుని ఉనావ్, నాకు ఆల్మోష్ట్ గుండె ఆగిపోయింది తెలుసా అన్నాను. వెంటనే తను ఎందుకు గేం ని కూడా అంత సెరీస్ గా తీస్కుంటావ్ అంది. కొంచం కంఫ్యూషన్ గా ఉన్నా, గేం అని చెప్పిందిగా అని కూల్ అయ్యాను.

ఇంతలో భూకంపం లా మొత్తం అదిరిపోతున్నాయ్, ఎంటా అని బయటకి వచ్చి చూస్తే పెద్ద పెద్ద టవర్స్ అన్ని ఒక దాని తర్వాత ఒకటి పడిపోతూ ఉన్నాయ్, చాల ఇళ్ళు నాశనం అవుతున్నాయ్, జనాలు అటు ఇటు పరిగెడుతున్నారు.. ఇంతలో తను వెనకనుంచి ఒక స్లో మెలోడీ సొంగ్ పాడతం మొదలు పెట్టింది..

let this world end
I never leave you alone

My heart won't leave you
you are my soul mate
you are my sweet love

let this world end
I never leave you alone

తను పాడుతూ ఉంటే నా చుట్టు ఉన్న ప్రపంచం అంతా మళ్ళి మంచిగా కనిపిస్తోంది.. పడిపోయిన టవర్స్ మళ్ళి నిల్చుంటున్నాయ్, ఇళ్ళు సెట్ ఐపోతున్నాయ్, సినిమాల్లో లా రివైండ్ బుటన్ నొక్కినట్టుగా ఉంది.

చుట్టూ గ్రీనరీ, పక్షులు, చిన్న చిన్న చినుకులు.. చాలా రొమాంటిక్ గా మారిపోయింది ప్రపంచం..

నేను తన వైపు తిరిగాను. తను " I Love U Sooo Much" అని చెప్పి నన్ను గట్టిగా వాటెసుకుంది..

సడనుగా పెద్దగా " ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే..!! " అని ఎవరో చెపింది వినిపించి కళ్ళు తెలిచాను..

నైట్ TV పెట్టి పడుకున్నా, సో అందులో Ad వస్తోంది.. హుం... అనుకుని లాప్టాప్ ఓపెన్ చేసి ఇదిగో ఈ కల రస్తున్నాను..

కల ఏం అర్దం కాకపోయినా, తను నా కోసం పాట పాడటం, నాతోనే ఉంటానని చెప్పటం, నా దగ్గరకి రావటం చాలా బాగా నచ్చాయి.. లైఫ్ కూడా కలలా ఉంటే ఎంత బావుండు..

Anyway this dream had hold place in my one of the best dreams.. :)

Tuesday, February 3, 2015

నేను ఎమైనా చెప్పాలా..!! అంది..

హాయ్...

ప్రతి సారీ ఎదోక చిలిపి కల వస్తుంది...
కానీ ఈసారి మాత్రం కొంచం కొత్తగా వచ్చింది.

తను ఫ్యామిలీ తో మా ఇంటికి వచ్చింది.
ఆంటీ వీకెండ్ మా ఇంట్లోనే అని చెప్పారు.
నేను నా బెడ్ రూం లోకి వెళ్ళి ఎగిరి గంతేసి
యాహూ...!!! అని గట్టిగా అరిచాను.

మేమంతా కలిసి బోజనానికి కుర్చున్నాం
నా చూపులన్నీ తనవైపే ఉన్నాయి
థను మాత్రం ఎవరైనా గమనిస్తున్నారెమో అని కంగారుగా
చూస్తోంది

నా ప్రపంచం అంతా తన ముఖం, తన గొంతు, తన స్పర్శ
అంతా తనే నిడిపోయినట్టుగా ఉంది

బోజనం అయిపొయాక అమ్మా-నాన్న, ఆంటీ-అంకుల్ సినెమా పెట్టుకోని చూస్తున్నారు.
నేను తను నా రూం లో ఉన్నాం
తను నా డ్రాయింగ్స్ చూస్తోంది
నేను మనసులో "I Love This Day" అనుకున్నాను.
ఇంతలో ఉన్నట్టుండి కరెంట్ పోయింది..
"చిన్నా చిన్నా.. ఉన్నావా ??" అంతూ తను నా చేయి పట్టుకుంది గట్టిగా

వెంటనే కరెంట్ వచేసింది మళ్ళీ..
మేమిద్దరం ఎదో కొత్త ప్రదేశం లో ఉన్నాం. అంతా కొత్తగా ఉంది
తను నన్ను పట్టుకోని కంగారు పడిపోతోంది
నేను నా కంగారుని లోలోపల ఆపేసి తనకి ధైర్యం చెప్తున్నా
కొడ్డిసేపటికి నాకర్దమైంది
మేము స్పేస్ షిప్ లో ఉన్నాం అని..
చాల భయం వేసింది, కాని నా భయం తనని ఇంకా భయపెడుతుందని
తనకి ధైర్యం చెప్తూ ఉన్నాను

కొద్దిసేపటికి మా కంగారు పోయింది
నాకేందుకో ఇప్పుడు చెప్పేయ్యాలి అనిపింది
కొద్దిసేపటికి తను మెల్లగా నిద్రపోయింది

నేను ఒక పేపర్ తీస్కుని అందులో తనకి చెప్పాలనుకున్నవి రాసుకుంటున్నాను
" నువ్ నాతో ఉన్నంత వరకు నేను ఇలానే ఉందటానికి కూడా సిద్ధం.
నీ ప్రతి అడుగూ, ప్రతి మాటా, నీ ప్రతి శ్వాసలో
ఎప్పుడూ.. నా చివరి శ్వాస వరకూ తోడుగా ఉందాలనుకుంటున్నను.
నా మనసు కోరుకునే
నీ అమాయకపు మాటలని
నాకోసం పలుకుతావు కదూ..
నీ అల్లరిలో నాకూ వాటా ఇస్తావ్ కదూ.."
సడనుగా పెన్ను పడటం ఆగిపోయింది..

నేను పెన్నుని అదిలిస్తున్నాను, పడుతుందేమో అని
ఇంతలో "ఎం రాస్తున్నావ్ ? " అంతూ తను లేచింది

ఎం లేదు చూపిస్తానులే తరువాత అని ఆ పేపర్ ని నా జేబులో పెట్టేసుకున్నాను
" నీతో ఒక మాట చెప్పాలి.." అంది తను

ఎంటో చెప్పు అనగానే
"మనసు ఎప్పుడూ ఒక తోడు కోరుకుంటుంది.
అది తనకోసమే బ్రతికే మనసైతే ఇంకా సంతోషిస్తుంది.
నా మనసు నీ తోడు కావాలంటొంది.. ఉంటావ ?? " అన్నది.

నా నోట మాట లేదు
నేను చెప్పాలనుకున్నది తన మనసులోంచి వచ్చిందే అని
ఆశ్చర్యంగా చూస్తుండిపోయాను.
నేను 3 years గా ఎదురు చూస్తోంది ఈ రోజు కోసమేగా అనుకుని
చాల excite అయిపోయాను

తను నా దగ్గరగా వచ్చింది
నా చేతులు పట్టుకుని " ఇలా నీతో కలిసి.." అని ఎదో చెప్పబోతోంది
వెంటనే నేను " ప్రపంచమంతా చుట్టెయ్యాలనిపిస్తోంది.." అని తన మాటని పూర్తి చేసాను
తను వెంటనే నన్ను గట్టిగా హత్తుకుని "I love you chinnaa" అంది

నేను కూడా "I love you too " అని తనని పట్టుకుని
కళ్ళు మూసుకున్నాను..

ఇంతలో "babyy..babyy.." అని ఎవరో గట్టిగా పిలిచినట్లు అనిపించింది
నేను కళ్ళు తెరిచాను.. shockkk
నేను కన్నది కలా..?? అనుకుని.. అలా కూర్చుండిపోయాను.

"babyy.., త్వరగా రా నాన్నా..!!" అని ఆంటీ పిలుస్తున్నారు..
చిన్నాకి చెప్పి వస్తానమ్మా.. అని తను గట్టిగా అన్నది వినపడింది
నేను తలుపు తీసే లోపే తనే లోపలికి వచ్చేసింది
"నేను బయల్దేరుతున్నాను.. ఎమైనా చెప్పాలా..!!" అంది..
నేనేం మాట్లాదలేదు. బయట వరకూ వెళ్ళి కార్ ఎక్కేవరకు ఉండి లోపలకి వచ్చేసాను

అలా కూర్చుని, ఆల్బము లో తన ఫోటో చూస్తున్నాను
ఇంతలో నా మొబయిల్ రింగ్ అయింది
తీసి చూస్తే తన కాల్ వస్తోంది,
ఉన్నట్టుంది సౌండ్ బాగా ఎక్కువైపొఇంది

అంతే సడనుగా మెలకువ వచ్చేసింది..
టైము 9:30.. వామ్మో ఆఫీసు అనుకుంటూ, లేచి రెడీ అయిపోయి
ఆఫీసు కి వెళ్ళి, తనకి మెసేజ్ చేసాను, నువ్ కలలోకి వచ్చావ్ అని.

ఒక్కోసారి అనిపిస్తుంది
నేను ఎప్పుడూ ఇలా కలలు కంటూ ఉండిపోవాల్సి వస్తుందేమో అని.
తనకి నేను నచ్చనేమో అని.. hmm...