Monday, September 3, 2012

వారే మావారు అంటూ నన్ను పిలచి...


నా ఇంజనీరింగ్ అయిపోయిన ఒక నాలుగు సంవత్సరాల తర్వాత,
నా బంధువుల ఇంట్లో ఏదో ఒక వేడుక జరుగుతుంది...
దానికి పెదనాన్నలు, బాబాయిలు, పిన్నులు, పెద్దమ్మలు, అత్తలు అందర్నీ పిలుస్తారు...

నేను నార్మల్ గా ఆఫీసు నుండి ఇంటికి వస్తాను...
డోర్ తెరవగానే నా భార్య చక్కగా ముస్తాబై ఎదురుగా నించుని ఉంటుంది...
ఏమిటీ హడావిడి అని అడగగానే వేడుక విషయం చెప్పి,
సర్ది ఉంచిన సూట్కేస్ చూపిస్తూ, నెక్ష్ట్ ఫ్లైటు కు టికెట్టులు బుక్ చెసానంటూ,
ఫ్రిజ్ లోనుండి జూస్ తీసి చేతికిచ్చి, 
"త్వరగా రెడీ అవ్వండి ఇంకా గంట మాత్రమే ఉంది" అంటుంది...
త్వర త్వరగా సిద్ధమయ్యి ఎయిర్ పోర్ట్ కు వచ్చి , 
ఇండియా ఫ్లైటు ఎక్కి ఇండియా వస్తాము...
ఇక్కడకు రాగానే మమ్మల్ని రిసీవ్ చేస్కోవటానికి 
అమ్మ, నాన్న, అన్న, వదిన, ఇంకొంతమంది బంధువులు ఎదురుచూస్తుంటారు...
అక్కడ నుండి ఇంటికి వస్తాము...

ఇంటికి రాగానే అన్న పిల్లలు,
"బాబాయ్ మాకేం తెచావ్" అంటూ సూట్కేస్ వైపుగా వస్తారు...
అప్పుడు నా భార్య "ఆగండి నేను ఇస్తానుగా...!!!" అంటూ 
సూట్కేస్ తెరచి వారి ముందుంచుతుంది...
ఇంతలో నాన్న "ఏరా ఎలా సాగుతోంది లైఫ్" అంటూ 
వెనుకగా వచ్చి నా ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుంటారు...
నేను సమాధానం చెప్పబోయే లోపే 
వంట గదిలోంచి అమ్మ 
నాన్నకు అన్నకు టీ తీస్కు వస్తూ "వేళ పట్టున తింటున్నావా ?" అని అడిగి 
తన చిన్న కోడలి పైపు చూస్తూ "మావాడేమైనా ఇబ్బంది పెడుతున్నాడామ్మా.!!" అంటుంది...
అప్పుడు తను "అయ్యయ్యో అదేం లేదు అత్తయ్య గారూ" అని చెప్పి
"నన్ను పిలవాల్సింది, మీరొక్కరే కష్టపడ్డారు" అంటుంది...

ఇంతలో వదిన పైకి రా ఆల్బంస్ చూపిస్తానంటూ
తనని మేడపైకి తీస్కువెళ్తుంది...
ఇలా ఆరోజు గడిచిపోతుంది...

మరుసటి రోజు బంధువుల ఇంటికి వెళ్తాము...
నేను సూట్ లో, నా భార్య బ్లూ శారీ విత్ గోల్డెను చంకీస్ లో వెళ్తాము...
బంధువులంతా "హేయ్ యు.ఎస్.ఎ నుండి ఎప్పుడొచారు ?" అని అడుగుతారు...
ఇంతలో నా భార్య పాత స్నేహితులు అక్కడకు వస్తారు...
తను వారితో ముచ్చటలాడుతూ, 
నవ్వుతూ తన కుడి చేతి మధ్య వేలును తన మేడపై ఉన్న హారం పై వేస్తుంది...
అప్పుడు తన స్నేహితురాళ్ళు "నెక్లెస్ చాలా చాలా బాగుంది. 
ఎవరి సెలెక్షను ?" అని అడగగానే
"మావారిచ్చిన బర్త్ డే గి్ఫ్ట్" అని చెప్పి అటూ ఇటూ చూస్తూ నన్ను వెదికి 
కనపడగానే అదిగో వారే మావారు అంటూ నన్ను పిలచి
వారికి పరిచయం చేస్తూ నా చేతిని తన చేతితో సంకెల వేస్తూ
నా బుజం పై తల వాలుస్తుంది...

ఇదంతా నాకు ఇంజనీరింగ్ మొదటి వత్సరం లో వచ్చిన కల
ఇదే నా జీవితం లో వస్తే...!!!!?
ఇలాంటి ఆణిముత్యాల్లాంటి కలలు నిజ జీవితం లో జరిగినా జరగకపోయినా
ఒక మధుర గ్నాపకం గా మిగిలిపోతాయి...
నాకు మాత్రం దీనిని నిజం అవ్వాలనే కోరుకుంటున్నాను...

4 comments:

  1. మంచి భావాలు, బాగుందండి!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ...
      తరచూ వీక్షిస్తూంటారని భావిస్తున్నాను...

      Delete
  2. Are you married? meeru kalala lokam lone untara always?

    ReplyDelete
    Replies
    1. hahaha...
      ledandi...nenu Final year B.Tech student...
      naku ila unte baguntundi ani undi...
      anduke rasthunna...
      4 years tharvatha elaago married ayye untaaga...

      Delete