Friday, April 26, 2013

తను నన్ను పట్టుకొని అమాంతం ముద్దు పెట్టేసింది.

హలో ఫ్రెండ్స్...

చాలా కాలం తరువాత మళ్ళీ ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది.
ఐతె మరి ఈసారి కూడా ఒక కలతో వచ్చాను.
కానీ ఇది చాలా చాలా చిన్ని చిలిపి కల.

నా మొబైల్ రింగ్ అవుతోంది.
నేను మాత్రం ఏదో తెలియను మైమరపులో ఉన్నాను.
అప్పుడు నేను నా స్నేహితుని ఇంట్లో ఉన్నాను.
వాడు రెండు సార్లు నన్ను పిలిచి
ఎదో ధ్యాసలో ఉన్నానని గ్రహించి నా మొబైల్ తీసి కాల్ లిఫ్ట్ చేసాడు.

ఎవరో అమ్మాయి...
చిన్నా ఉన్నాడా అని అడిగింది.
వాడు వెంటనే నా వీపు మీద చరిచి నా మైమరపుని వదలగొట్టాడు.
ఎవరో అమ్మాయి, నీతో మట్లాడాలంట అని
మొబైల్ నా చేతిలో పెట్టాడు.
నేను మాట్లాడగానే
అవతలి అమ్మాయి ఏడవటం మొదలు పెట్టింది.
ఎవరు మట్లాడేది ? ఎందుకు ఏడుస్తున్నారు ? అని అడిగాను...
ఏమి మాట్లాడలేదు.

నేను మొబైల్ డిస్ప్లే మీద నంబరు చూశాను...
తను నాకు ఫోను చేయటం ఏంటి అని ఆశ్చర్యం వేసింది.
మళ్ళీ నా చెవి దగ్గర పెట్టుకోని
ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ ? అని అడిగాను.
తన కన్నీరు ఇంకా ఆగడం లేదని నాకర్ధమైంది.
ఎక్కడున్నావ్ ఇప్పుడు ? అని గట్టిగా అడిగాను.
నీకు ఇష్టమైన ప్లేస్ లో నే ఉన్నాను అని చెప్పింది.

నేను ఫోను పెట్టేసి బయల్దేరాను.
నేను బైక్ మీద వెళ్తున్నా, నా మనసు మాత్రం తన దగ్గరే ఉంది.
అసలు తను ఎందుకు ఏడుస్తోంది అని పదే పదే అదే ప్రశ్న...

నాకిష్టమైన ప్లేస్ వైజాగ్ బీచ్...
తను అక్కడికి రావటం నాకు ఆశ్చర్యమేసింది.
నేను విజయవాడ నుండి బయల్దేరాను...
బైక్ మీద వైజాగ్ వెళ్తున్నా...
ఎలా అని కానీ, ఏమీ ఆలోచించలేదు.
తన కోసం బయల్దేరాను అంతే.
ఆ 4:30 గంటలు...నా బైక్ స్పీడ్ 100 లోనే ఉంది.

అక్కడికి రాగానే తను ఒక బెంచ్ పై కూర్చుని
నాకోసం ఎదురు చూస్తోంది.

బీచ్ అంతా నిర్మానుష్యం గా ఉంది.
నేను తన దగ్గరకి వెళ్ళి తన బుజంపై చేయి వేశాను.
తను ఉలిక్కిపడి లేచి అమాంతం నన్ను వాటేసుకుంది.
తన ఇంకా ఎడుస్తూనే ఉంది.

నేను తనని వెనక్కి అని, 
ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ ??
అని అడిగాను.


అప్పుడు తను చెప్పిన మాటలు
" ఐ లవ్ యూ రా...
సారీరా చిన్నా, ఇన్నాళ్ళూ నిన్ను దూరంగా ఉంచాను.

నన్ను క్షమిస్తావు కదూ..!!!
ప్లీస్ రా ఇంక లైఫ్ లో నేను నిన్ను దూరం చేస్కోవాలనుకొవటం లేదు.

నీ ప్రేమకి నేను లొంగిపోతున్నాను. "అని మళ్ళీ నన్ను వాటేసుకుంది...
నా నోట మాట లేదు.

నేను తనని హోల్డ్  చేయలెదు.

నేను బాగా కంఫూషనులో ఉంటే
తను నన్ను పట్టుకొని అమాంతం ముద్దు పెట్టేసింది.

వేంటనే నేను ఉలిక్కిపడి లేచాను.
టైం 5:30... ఇంకేముంది మళ్ళీ నిద్రపోయాను.
మళ్ళీ ఎప్పుడో 8:00 కి అమ్మ లేపింది.

ఈ కల ఎప్పటికీ కల గానే మిగిలిపోతుందేమో...
నేను మాత్రం ఎదురు చూస్తునే ఉంటాను.

Monday, January 14, 2013

అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షను ఉంది వెళ్ళాలి మర్చిపోయావా ???

హహ్హా....హాయ్
మళ్ళీ ఒక కొత్త చిన్ని చిలిపి కల....

కానీ ఈసారి సగమే వచింది... :(
నాకు బాగా నిద్ర పట్టి స్లోమోషను లో 
కళ్ళ ఎదురుగా ఎదో ఒక అందమైన ప్రదేశం ప్రత్యక్షమైంది.
అది ఒక సముద్ర తీరం.
చల్లటి గాలి అలా అలా నన్ను తాకుతూ నా పెరిగిన జుట్టును వెనక్కి తోస్తూ
ముఖమంతా మల్లెపూలతో మర్ధన చేస్తున్నట్లుగా కమ్మేసింది.
నేను టైటానిక్ సినెమాలో హీరో నించున్నట్లు చేతులు అమాంతం చాచి 
ఆ గాలి చేసే అల్లరిని ఆశ్వాదిస్తుంటే 
వెనక నుంచి ఎవరో పిలిచినట్లనిపించింది.
వెంటనే ఆ ఫోజు తీసేసి వెనక్కు తిరిగాను.
ఎదురుగా మా తమ్ముడున్నాడు.
ఏంటిరా పిల్చావ్ అన్నాను.
అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షను ఉంది వెళ్ళాలి మర్చిపోయావా ??? అని గట్టిగా అరిచాడు.
ఓ అవును కదా అని అక్కడ నుంది వచేసి
నేనూ వాడూ కలిసి అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాం.
రోడ్డు మీద నడుస్తున్నా నా మనసు ఇంకా ఆ సముద్ర తీరాన్నే తలచుకుంటోంది.
ఎందుకో తెలియదు ఆ ప్రదేశం నన్ను అలా మైమరపింపజేసింది.
ఉఫ్ ఫ్ ఫ్ ఫ్ ... ఇక వదిలేద్దాం లే అని వాడితో ముచ్చట్లు పెడుతూ 
అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేశాము.

వాళ్ళ ఇల్లు చాలా చాలా పెద్దది...
చాలా మంది చుట్టాలు ఉండి ్సందడి సందడిగా ఉంది.

కాని నాకు మాత్రం అక్కడ అంత ప్రశాంతత కనిపించలేదు. అనిపించలేదు.
నాతో వచిన మా తమ్ముడు ఎక్కదకో వె్ళ్ళిపోయాడు.
చుట్టూ చూసి ముందుకు కదిలాను. వెంటనే ఎవరో వచ్చి 
నీకు ఇష్టమైన వాళ్ళు ఆ పక్కన ఉన్నారు అని
ఇంటి వెనక పక్క ఉన్న గుడిని చుపించారు.
ఆ మాట పూర్తి అవగానే నా కాళ్ళు అటుగా పరిగెత్తాయి.
లోపలికి వెళ్ళగానే నా కళ్ళు ఆ ముఖాన్ని చూసి కళ్ళార్పటం ్మర్చిపోయాయి.
ఆ అందం అలాంటిది మరి.
తను అక్కడ ప్రదక్షిణలు చెస్తూ కనిపించింది.
నా నోట మాట కూడా పడిపోయింది.
నేను కూడా దణ్ణం పెట్టుకోని ప్రదక్షిణలు మొదలు పెట్టాను.
నేను మొదలు పెట్టగానే నావి ఐపొయాయి అని తను బయటకి కదిలింది.
మొదలుపెట్టినవి మద్యలో ఆపకూడదు. ఏం చెయ్యాలి ???
ఇక తప్పదులే అని వెళుతుంటే తనవైపు ఒక చూపు విసిరాను.
తను నా వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వి ఎదురుచూస్తుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది.

నేను ప్రదక్షిణలు పూర్తి చేసి తన కోసం వెతుకుతున్నాను.
అక్కడున్న ప్రతి గదిలోనూ వెతికాను 
తను కనిపించలేదు.
సడనుగా మా తమ్ముడు కనిపించాడు.
తనని ఎక్కడైనా చూసావా అని అడిగాను.
వాడు మేడ పైకి వెళ్ళినటుుయందని చెప్పాడు.
ఆ మాట విన్నవెంటనే పైకి వెళ్ళి చూసాను...
అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కానీ తను మాత్రం లేదు.
నేను నిట్టూర్చుకుంటూ కిందకు వస్తుంటే 
తను " ఎదురుచూస్తుంటాను " అని చెప్పిన తర్వాత 
" నీకిష్టమైన ప్రదేశం లో " అని అన్న మాట గుర్తుకు వచింది.

ఇక నేను మళ్ళీ ఆ సముద్ర తీరానికి పరుగు తీసాను.
దారి చాలా పెద్దదిగా ఉంది.
పరిగెడుతూనే ఉన్నాను, పరిగెడుతూనే ఉన్నాను...
సడనుగా మా అమ్మ నిద్ర లేపారు...
కల చెదిరిపోయింది.
కాని చాలా బాగ నచింది నాకు.
ఆ కల ఆ అమ్మాయి.