నా కలల ప్రపంచం లో మళ్ళీ ఒక చిలిపి కల...
ఈరోజు ఉదయం నేను నా కాలేజి బస్ లో ఉన్నప్పుడు నిద్రవచ్చేసింది...
అప్పుడు నాకు వచిన కల ఇది...
ఎప్పటి లాగే నేను కాలేజి కి వెళ్ళి నా క్లాసురూం లో చదువుకుంటూ ఉన్నాను...గురువులు వారి పని వారు కానిస్తున్నారు...నాకు బాగా బోర్ కొట్టి నిద్రవస్తోంది...అప్పుడు చాలా ఫోర్స్ గా ఎవరో తలుపు కొట్టిన శబ్దం...అందరూ అటువైపు చూస్తున్నారు,లెక్చరర్ మెల్లగా వెళ్ళి తలుపు తీసింది.నేను మాత్రం నిద్రలో మునిగిపొయాను.సడనుగా జి.వి.ఆర్ అని ఎవరో గట్టిగా అరిచేసరికి మెలకువ వచింది...నిదానంగా లేచి కళ్ళు నిమురుకుంటూ తలుపుకేసి చూసాను...నేను ఇష్టపడే అమ్మాయి నా ఎదురుగా ఉంది.అప్పుడు నేను బిత్తరపోయి చూస్తుంటే, ముఖం లో బోలెడు కోపాన్ని కూడగట్టుకొని..,కళ్ళు చిన్నవి చేస్తూ వేగంగా నా దగ్గరకు వచ్చికుడి చేయి అమాంతం చాచి చెంప చెళ్ళుమనిపించింది...!!!!నా క్లాస్మేట్స్ జి.వి.ఆర్ ని ఒక అమ్మాయి కొట్టటం ఏంటి అని ఆశ్చర్యపోయి చూస్తనన్నారు...అప్పుడు నా ఎడమ చేయి చెంపపై వాలి ఎందుకు కొట్టిందా అని ఆలోచిస్తుంటే"ఏంటి నన్ను అవైడ్ చేస్తున్నావా ??? వారం రోజులుగా మెసేజ్ చెయట్లేదు..!!?నేను ఎంత భయపడ్డానో తెలుసా..? ఆటలుగా ఉందా ? ప్లీస్ ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు."అంటూ తలదించుకుని నన్ను అమాంతం వాటేసుకుని ఏడ్చింది...
ఇంకేముంది...నా క్లాస్మేట్స్ అందరూ అవాక్కయ్యి చూస్తుండిపోయారు...ఆ లెక్చరర్ " What is this GVR ? You both just get out of the class..." అని మావైపు కోపంగా చూస్తూ కసురుకుంది...వెంటనే నేను ఆవిడకి సారీ చెప్పి, తనని తీస్కుని బయటకు వచ్చి" కొంచం బిజీ మూలంగా కాంటాక్ట్ అవలేదురా...I'm so sorry, ఇంకెప్పుడూ ఇలా జరగదు."అని నచ్చజెప్పి తనని ఆటో ఎక్కించి " జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు."అంటుండగా బస్సు కాలేజి చేరిందని నా స్నేహితుడు నిద్రలేపాడు.
ఈ కల ఎంత బాగుందో...ఇది అసాధారణం అని తెలుసు...కాని చాలా నచ్చింది...
Monday, September 24, 2012
Monday, September 3, 2012
వారే మావారు అంటూ నన్ను పిలచి...
నా ఇంజనీరింగ్ అయిపోయిన ఒక నాలుగు సంవత్సరాల తర్వాత,
నా బంధువుల ఇంట్లో ఏదో ఒక వేడుక జరుగుతుంది...
దానికి పెదనాన్నలు, బాబాయిలు, పిన్నులు, పెద్దమ్మలు, అత్తలు అందర్నీ పిలుస్తారు...
నేను నార్మల్ గా ఆఫీసు నుండి ఇంటికి వస్తాను...
డోర్ తెరవగానే నా భార్య చక్కగా ముస్తాబై ఎదురుగా నించుని ఉంటుంది...
ఏమిటీ హడావిడి అని అడగగానే వేడుక విషయం చెప్పి,
సర్ది ఉంచిన సూట్కేస్ చూపిస్తూ, నెక్ష్ట్ ఫ్లైటు కు టికెట్టులు బుక్ చెసానంటూ,
ఫ్రిజ్ లోనుండి జూస్ తీసి చేతికిచ్చి,
"త్వరగా రెడీ అవ్వండి ఇంకా గంట మాత్రమే ఉంది" అంటుంది...
త్వర త్వరగా సిద్ధమయ్యి ఎయిర్ పోర్ట్ కు వచ్చి ,
ఇండియా ఫ్లైటు ఎక్కి ఇండియా వస్తాము...
ఇక్కడకు రాగానే మమ్మల్ని రిసీవ్ చేస్కోవటానికి
అమ్మ, నాన్న, అన్న, వదిన, ఇంకొంతమంది బంధువులు ఎదురుచూస్తుంటారు...
అక్కడ నుండి ఇంటికి వస్తాము...
ఇంటికి రాగానే అన్న పిల్లలు,
"బాబాయ్ మాకేం తెచావ్" అంటూ సూట్కేస్ వైపుగా వస్తారు...
అప్పుడు నా భార్య "ఆగండి నేను ఇస్తానుగా...!!!" అంటూ
సూట్కేస్ తెరచి వారి ముందుంచుతుంది...
ఇంతలో నాన్న "ఏరా ఎలా సాగుతోంది లైఫ్" అంటూ
వెనుకగా వచ్చి నా ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుంటారు...
నేను సమాధానం చెప్పబోయే లోపే
వంట గదిలోంచి అమ్మ
నాన్నకు అన్నకు టీ తీస్కు వస్తూ "వేళ పట్టున తింటున్నావా ?" అని అడిగి
తన చిన్న కోడలి పైపు చూస్తూ "మావాడేమైనా ఇబ్బంది పెడుతున్నాడామ్మా.!!" అంటుంది...
అప్పుడు తను "అయ్యయ్యో అదేం లేదు అత్తయ్య గారూ" అని చెప్పి
"నన్ను పిలవాల్సింది, మీరొక్కరే కష్టపడ్డారు" అంటుంది...
ఇంతలో వదిన పైకి రా ఆల్బంస్ చూపిస్తానంటూ
తనని మేడపైకి తీస్కువెళ్తుంది...
ఇలా ఆరోజు గడిచిపోతుంది...
మరుసటి రోజు బంధువుల ఇంటికి వెళ్తాము...
నేను సూట్ లో, నా భార్య బ్లూ శారీ విత్ గోల్డెను చంకీస్ లో వెళ్తాము...
బంధువులంతా "హేయ్ యు.ఎస్.ఎ నుండి ఎప్పుడొచారు ?" అని అడుగుతారు...
ఇంతలో నా భార్య పాత స్నేహితులు అక్కడకు వస్తారు...
తను వారితో ముచ్చటలాడుతూ,
నవ్వుతూ తన కుడి చేతి మధ్య వేలును తన మేడపై ఉన్న హారం పై వేస్తుంది...
అప్పుడు తన స్నేహితురాళ్ళు "నెక్లెస్ చాలా చాలా బాగుంది.
ఎవరి సెలెక్షను ?" అని అడగగానే
"మావారిచ్చిన బర్త్ డే గి్ఫ్ట్" అని చెప్పి అటూ ఇటూ చూస్తూ నన్ను వెదికి
కనపడగానే అదిగో వారే మావారు అంటూ నన్ను పిలచి
వారికి పరిచయం చేస్తూ నా చేతిని తన చేతితో సంకెల వేస్తూ
నా బుజం పై తల వాలుస్తుంది...
ఇదంతా నాకు ఇంజనీరింగ్ మొదటి వత్సరం లో వచ్చిన కల
ఇదే నా జీవితం లో వస్తే...!!!!?
ఇలాంటి ఆణిముత్యాల్లాంటి కలలు నిజ జీవితం లో జరిగినా జరగకపోయినా
ఒక మధుర గ్నాపకం గా మిగిలిపోతాయి...
నాకు మాత్రం దీనిని నిజం అవ్వాలనే కోరుకుంటున్నాను...
Subscribe to:
Posts (Atom)