హాయ్ ఫ్రెండ్స్...
చాలా రోజుల తరువాత నాకు మరొక చిలిపి కల వచ్చింది. చాలానే వచ్చాయి కాని ఇది చాలా డిఫరెంట్ గా ఉంది.
నేను మా తమ్ముడు మా బబాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాం.
అనయ్యా బయటకి వెళ్ళొద్దాం అన్నాడు వాడు. సరే అని బయటకి బయల్దేరాం.
ఎటు వెల్దాం అని అడిగితే షిప్ లో అలా వెళ్ళొద్దాం ఎంత దూరం అయితే అంత దూరం అన్నాడు. నేను షాక్ తిన్నాను, నువు ఏం మాట్లాదుతున్నావ్ రా అని నేను అనగానే, బీచ్ లో నే గా ఉన్నాం అని పక్క్నే మోటార్ బోట్ చుపించాడు.
హుం... సరే పద అని బోట్ ఎక్కి అలా వెళ్తున్నాం. కొంచం దూరం వెల్లాక వెనకాల పోలీసులు వస్తున్నారు, బాబోయ్ ఇదేంతి అని బోట్ అంతా చుసాం, ఆ బోట్ నిండా బాంబ్ మెటిరియల్స్ ఉన్నాయ్. చచ్చాం రా బాబోయ్ అనుకుని స్పీడ్ గా వెల్తున్నాం. అసలు ట్విస్ట్ ఇప్పుడు వచింది.
సైడ్ నుంచి నేను ఇష్టపడే అమ్మాయి ఇంకో బోట్ వేస్కోని వచింది. చేతిలో గన్ ఉంది, లేడీ డాన్ లా ఉంది. ఫట్ ఫట్ ఫట్ అని పోలిసులని కాల్చేసింది.
నేను షాక్ లో నె ఉన్నా, బుత్ పోలిసులు చచ్చినందుకు ఒక పక్కన హాపీ గా నె ఉంది. నువ్వేంటి ఇక్కడునావ్ ? చేతిలో ఆ గన్ ఏంటి ? వాళ్ళని అలా చంపేశావ్ ఏంటి ? ఇలా ప్రశ్నలు వస్తునే ఉన్నాయ్...
షట్ అప్ అని గట్టిగా అరిచి, ఆ గన్ నా వైపు తిప్పింది. అనవసరమైన ప్రశ్నలు వేస్తే లేపి పడేస్తా, మా మెటిరియల్ ఎందుకు ఎతుకెల్తున్నావ్ ? ఎవరు పంపారు నిన్ను అని అడిగింది...
కాని మనకి అంత టైం లేదు, తను గన్ పెట్టగానె నా మతి పోయింది. కళ్ళు తిరిగి పడిపొఆను.
ఏం జరిగిందో నాకు తెలీదు. కొద్దిసేపటికి లేచాను. పక్కనె తను కూర్చుని ఉంది, మా తమ్ముడు ఏడి అని అడిగాను. నాకేం తెలుసు అని సమాధానం ఇచ్చింది.
నువ్వేంటి గన్ పటుకుని ఉనావ్, నాకు ఆల్మోష్ట్ గుండె ఆగిపోయింది తెలుసా అన్నాను. వెంటనే తను ఎందుకు గేం ని కూడా అంత సెరీస్ గా తీస్కుంటావ్ అంది. కొంచం కంఫ్యూషన్ గా ఉన్నా, గేం అని చెప్పిందిగా అని కూల్ అయ్యాను.
ఇంతలో భూకంపం లా మొత్తం అదిరిపోతున్నాయ్, ఎంటా అని బయటకి వచ్చి చూస్తే పెద్ద పెద్ద టవర్స్ అన్ని ఒక దాని తర్వాత ఒకటి పడిపోతూ ఉన్నాయ్, చాల ఇళ్ళు నాశనం అవుతున్నాయ్, జనాలు అటు ఇటు పరిగెడుతున్నారు.. ఇంతలో తను వెనకనుంచి ఒక స్లో మెలోడీ సొంగ్ పాడతం మొదలు పెట్టింది..
let this world end
I never leave you alone
My heart won't leave you
you are my soul mate
you are my sweet love
let this world end
I never leave you alone
తను పాడుతూ ఉంటే నా చుట్టు ఉన్న ప్రపంచం అంతా మళ్ళి మంచిగా కనిపిస్తోంది.. పడిపోయిన టవర్స్ మళ్ళి నిల్చుంటున్నాయ్, ఇళ్ళు సెట్ ఐపోతున్నాయ్, సినిమాల్లో లా రివైండ్ బుటన్ నొక్కినట్టుగా ఉంది.
చుట్టూ గ్రీనరీ, పక్షులు, చిన్న చిన్న చినుకులు.. చాలా రొమాంటిక్ గా మారిపోయింది ప్రపంచం..
నేను తన వైపు తిరిగాను. తను " I Love U Sooo Much" అని చెప్పి నన్ను గట్టిగా వాటెసుకుంది..
సడనుగా పెద్దగా " ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే..!! " అని ఎవరో చెపింది వినిపించి కళ్ళు తెలిచాను..
నైట్ TV పెట్టి పడుకున్నా, సో అందులో Ad వస్తోంది.. హుం... అనుకుని లాప్టాప్ ఓపెన్ చేసి ఇదిగో ఈ కల రస్తున్నాను..
కల ఏం అర్దం కాకపోయినా, తను నా కోసం పాట పాడటం, నాతోనే ఉంటానని చెప్పటం, నా దగ్గరకి రావటం చాలా బాగా నచ్చాయి.. లైఫ్ కూడా కలలా ఉంటే ఎంత బావుండు..
Anyway this dream had hold place in my one of the best dreams.. :)